#RRR లో ఆ సీన్స్ హైలైట్ అంట!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుతుంది. రీసెంట్ గా టీం [more]

Update: 2019-03-12 08:19 GMT

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుతుంది. రీసెంట్ గా టీం రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించింది. ఎపిసోడ్ మొత్తం రఫ్ ఎడిటింగ్ చేసి చూసిన టీం అవుట్ పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో తీసిన ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు.

త్వరలో సినిమా వివరాలు…

ఇందులో చరణ్ ఫైట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయట. ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రెస్ మీట్ ఈ నెల 14న జరగనుంది.

Tags:    

Similar News