#RRR హీరోల పాత్రలు రివీల్..!

Update: 2018-11-15 08:15 GMT

#RRR మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈలోపే ఈ సినిమా గురించి రోజుకొక కొత్త వార్త వస్తుంది. ఈ సినిమా కథ ఏంటి.. ఇందులో చరణ్ - ఎన్టీఆర్ ల పాత్రలు ఏంటి అన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే జక్కన్న మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఒక్క క్లూ కూడా బయటికి రాకుండా చూసుకుంటున్నాడు. కానీ ఎలా లేదన్న లీకులు మాత్రం బయటికి వచ్చేస్తున్నాయి.

వాస్తవ సంఘటన ఆధారంగా...

తాజా సమాచారం ప్రకారం ఇది కమర్షియల్ మూవీ కాదని తెలుస్తుంది. స్వాతంత్రం రాక ముందు తెలుగు రాష్ట్రంలో జరిగిన ఓ నిజ సంఘటనను ఆధారంగా ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారట. ఒక్కరు తక్కువ ఒక్కరు ఎక్కువ అనే ఫీలింగ్ లేకుండా ఇద్దరు హీరోల పాత్రలు చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారట. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఎక్కడా లోటు లేకుండా తీర్చిదిద్దారట.

దొంగా పోలీస్ అయినా...

ఇందులో పోలీస్ గా రామ్ చరణ్ దొంగగా ఎన్టీఆర్ నటించబోతున్నారు. దీనికి సంబంధించి ట్రయిల్ షూట్ కూడా జరిగింది. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే పూర్వపు కాలం కథ కాబట్టి బ్రిటిష్ పాలన, భారతీయుల బానిసత్వం ఇవన్నీ ఇందులో ఉంటాయట. పాత్రల స్వభావరీత్యా ఒకరు దొంగ, మరొకరు పోలీస్ అయినప్పటికీ ఇద్దరి టార్గెట్ ఒకటే ఉంటుందని అదే వాళ్లను కలిపే థ్రెడ్ గా రాసుకున్నట్టు చెబుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బుర్ర సాయిమాధవ్ ని డైలాగ్స్ రాస్తున్నారు.

Similar News