ఓవర్సీస్ లో దుమ్మురేపిన #RRR !!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR మూడువందల కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మితమవుతుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ విడివిడిగా [more]

Update: 2019-06-14 06:02 GMT

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR మూడువందల కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మితమవుతుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ విడివిడిగా సినిమాలు చేస్తేనే ఆ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. అదే ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమాపై ఇంకెన్ని అంచనాలుంటాయో వేరే చెప్పాలా… ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ కూడా #RRR షూటింగ్ లోకి జాయిన్ అవుతానని తెలుస్తుంది. అయితే RRR సినిమాపై ఇప్పుడొక న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అవడమే కాదు.. ఆ న్యూస్ చూస్తేనే RRR పై ఎంతగా అంచనాలు పెరిగాయో అర్ధమవుతుంది. #RRR బిజినెస్ అప్పుడే మొదలైంది.

అందులో భాగంగానే RRR మూవీ ఓవర్సీస్ హక్కులకు భారీ రేటు పలికిందని అంటున్నారు. గతంలో అనుకున్నట్లుగా RRR ఓవర్సీస్ హక్కులను దుబాయ్ కి చెందిన ఓ సంస్థకి నిర్మాత దానయ్య అమ్మేసినట్లుగా.. అది కూడా సింగిల్ పేమెంట్ ఇచ్చేలా డీల్ సెట్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే కనివిని ఎరుగని రీతిలో RRR ఓవర్సీస్ హక్కులకు 65 కోట్లకు వచ్చాయని.. అది కూడా రెండు మూడు పేమెంట్స్ లో కాకుండా సింగిల్ పేమెంట్స్ చేసేలా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లుచెబుతున్నారు. మరి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒకే ఒక్క ఓవర్సీస్ డీల్ తెలియజెప్పింది. మరి RRR పూర్తి బిజినెస్ చూస్తే ఆ అంచనాల ఎలా ఉంటాయో చూద్దాం.

Tags:    

Similar News