#RRR కి గెస్ట్ ఎవరో తెలుసా?

Update: 2018-11-05 03:06 GMT

రాజమౌళి 'బాహుబలి' సిరీస్ తరువాత కొంత విరామం తీసుకుని #RRR స్టార్ట్ చేసాడు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు నటిస్తున్నారు. ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవ్వాల్సిఉంది. రీసెంట్ గా ఈసినిమా ఓపెనింగ్ డేట్ ను ఆఫిషల్ గా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 11న ఉదయం 11 గంటలకి ముహూర్తం ఫిక్స్ చేసారు. దాంతో ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వీరితో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ గా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా?

జక్కన్న చెక్కిన 'బాహుబలి' తో ఇండియా వైడ్ డార్లింగ్ అయినా ప్రభాస్ #RRR ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. ఈ విషయం అధికారంగా ప్రకటించకపోయినా ఇది నిజం అని ఇండస్ట్రీ టాక్. అంటే ఒకే స్టేజి మీద ఎన్టీఆర్..చరణ్..ప్రభాస్ కనిపించనున్నారు. వింటానికే మనకి ఇలా ఉంటె ఆ రోజు వారిని చూసి ఫ్యాన్స్ ఎంత హ్యాపీ గ ఫీల్ అవుతారో చూడాలి..

ప్రభాస్ ఇండియాలో లేడు. రాధా కృష్ణ సినిమా కోసం ఇటలీలో ఉన్నాడు కదా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ప్రభాస్ #RRR లాంచ్ సమయానికి హైదరాబాద్ వస్తాడట. ప్రభాస్.. ఎన్టీఆర్ - చరణ్ ల మీద క్లాప్ కొట్టనున్నాడు. సో గెట్ రెడీ ఫర్ గ్రాండ్ ఈవెంట్

Similar News