#RRR రాజమౌళి కోసం స్నేహితుడిని పక్కన పెట్టేసిందా?

Update: 2018-11-25 03:59 GMT

రాజమౌళి 'బాహుబలి' తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ #RRR (వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నాడు. తాజాగా షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రంపై రోజుకో న్యూస్ వినబడుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సోలోగా సినిమాని మొదలుపెట్టిన రాజమౌళి.. ప్రస్తుతం ఇద్దరు హీరోలపై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్స్ తో పనిలేకపోవడంతో... ఇద్దరు హీరోలతోనే రంగంలోకి దిగాడు. అయితే ప్రస్తుతం #RRR కోసం హీరోయిన్స్ ని ఎంపిక చెయ్యని రాజమౌళి కళ్ళు ఏ హీరోయిన్ మీద పడుతుందా.. అనే అతృతతో.. ఒకపక్క హీరోయిన్స్ ఉంటే.. మరోపక్క చరణ్, ఎన్టీఆర్ లకు ఎలాంటి హీరోయిన్స్ ని దించుతాడో అనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు.

అయితే రాజమౌళి #RRR హీరోయిన్స్ రేసులో మొదటినుండి మహానటి కీర్తి సురేష్ ఉంది. అయితే కీర్తి సురేష్ దాదాపు గా ఎంపికైనట్లే అంటూ వార్తలొస్తున్నాయి. ఎప్పుడు బొద్దుగా వుండే కీర్తి సురేష్ రాజమౌళి కోసం కాస్త ఫిట్ గా మారుతుందంటున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కీర్తి సురేష్ తన ఫ్రెండ్ కి నో చెప్పిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. నేను లోకల్ సినిమా దగ్గరనుండి కీర్తి సురేష్ హీరో నాని తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాని కన్నా మంచి ఫ్రెండ్ కీర్తి కి లేరనే విషయం తాజాగా రానా నెంబర్ వన్ యారి సీజన్ టు లో అర్ధమయ్యింది. అలాంటి ఫ్రెండ్ తన సినిమా లో చెయ్యమని కీర్తిని అడిగితె కీర్తి రాజమౌళి సినిమా కోసమా నో చెప్పిందేనంటూ పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి.

నాని ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఆ సినిమాని ఏప్రిల్ 19 విడుదలంటూ రిలీజ్ డేట్ లాక్ చేసాడు. జెర్సీ తర్వాత ఇంద్రగంటి, చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకు కమిట్ అయిన నాని... చంద్రశేఖర్ యేలేటి సినిమా కోసమే హీరోయిన్ గా చెయ్యమని కీర్తి సురేష్ ని సంప్రదించగా... కీర్తి సురేష్ రాజమౌళి మల్టీస్టారర్ కోసం నాని సినిమాకి నో చెప్పిందట. మరి ఈ వార్తలో ఎంతనిజముందో కీర్తి గాని, నాని గాని స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది

Similar News