లాక్ డౌన్ లోను RRR హీరోల కష్టాలు?

లాక్ డౌన్ 21 నుండి మళ్ళీ 19 రోజులకి పెరగడంతో హీరోలు ఇళ్లకే పరిమితమై ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ టాలీవూడ్ లో ఇద్దరు హీరోలకు [more]

Update: 2020-04-15 06:25 GMT

లాక్ డౌన్ 21 నుండి మళ్ళీ 19 రోజులకి పెరగడంతో హీరోలు ఇళ్లకే పరిమితమై ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ టాలీవూడ్ లో ఇద్దరు హీరోలకు ఇంకా సినిమా కష్టాలే అంటున్నారు. వారే ఎన్టీఆర్- రామ్ చరణ్ లు. అదేమిటి RRR సినిమా షూటింగ్ కరోనా లక్డౌన్ తో వాయిదా పడింది గా.. మరి వీళ్లకి సినిమా కష్టాలేమిటి అనుకుంటున్నారా.. మరి రామ్ చరణ్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ లక్డౌన్ తో ఇంట్లోనే ఉంది RRR స్పెషల్ వీడియో కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మరి మే లో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది.. అప్పటికల్లా ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ని రాజమౌళి రెడీ చెయ్యాలి. లేదంటే ఎన్టీఆర్ ఫాన్స్ కి బలవుతాడు. అందుకే ఎన్టీఆర్ స్పెషల్ వీడియో కోసం ఎన్టీఆర్ ఇంట్లోనే ఉండి డబ్బింగ్ చెబుతున్నాడట. ఇక రామ్ చరణ్ కూడా తన పాత్రకి ఇంట్లో నుండే డబ్బింగ్ మొదలెట్టినట్టుగా టాక్ వినబడుతుంది. RRR కి పనిచేసే ప్రతి టెక్నీషియన్ ఇంట్లో నుండే తమ తమ పనులు చక్కబెడుతున్నారట.

ఇక హీరోలు డబ్బింగ్ చెప్పేందుకు క్వాలిటీ మైక్ ల తో పాటుగా సౌండ్ ప్రూఫ్ రూమ్ కావాలి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కోసం ఓ రెండు క్వాలిటీ మైక్ లు పంపాడట. ఇక సౌండ్ ప్రూఫ్ రూమ్స్ అంటే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇళ్లలో ఉండే మినీ థియేటర్స్ లో డబ్బింగ్ కార్యక్రమాలు చెప్పుకుంటున్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటూ ఈ లాక్ డౌన్ కాలాన్ని పూర్తి చేస్తున్నారట. కానీ ఫాన్స్ మాత్రం పాపం లక్డౌన్ లోను మా హీరోలకు సినిమా కష్టాలే అంటున్నారు. 

Tags:    

Similar News