రాజమౌళికి షాకిచ్చిన హీరోయిన్?

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా #RRR అనే ప్రాజెక్ట్ భారీ హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఇక రాజమౌళి సినిమాని మొదలుపెట్టేటప్పుడే హీరోహీరోయిన్స్ విషయంలో మీడియాకి [more]

Update: 2019-03-12 06:10 GMT

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా #RRR అనే ప్రాజెక్ట్ భారీ హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఇక రాజమౌళి సినిమాని మొదలుపెట్టేటప్పుడే హీరోహీరోయిన్స్ విషయంలో మీడియాకి క్లారిటీ ఇచ్చేసి మరీ సెట్స్ లోకి అడుగుపెట్టేవాడు. కానీ ఈసారి మాత్రం కేవలం హీరోలను తప్ప హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక #RRR లో నటించబోయే చాలామంది నటీనటులు విషయాలు కూడా బయటపెట్టడం లేదు. తాజాగా రెండో షెడ్యూల్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్న రాజమౌళి.. ఆ షెడ్యూల్ చివరి రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక #RRR పై రాజమౌళి ఏం మాట్లాడతాడో అనే క్యూరియాసిటిలో మీడియా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గాను, ఎన్టీఆర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే న్యూస్ ఉంది.

ఇక హీరోయిన్స్ విషయంలో రామ్ చరణ్ కి జోడిగా.. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ని ఫైనల్ చేసినట్లుగా… ఆమె అడిగిన పారితోషకం ఇవ్వడానికి #RRR నిర్మాతలు సిద్దపడినట్లుగా.. చరణ్ కి అలియా ఫైనల్ అనే న్యూస్ నడిచింది. ఇక అలియా ని సెట్ చేసేందుకు రాజమౌళి కొడుకు కార్తికేయ ముంబై వెళ్లినట్లుగా కూడా వార్తలొచ్చాయి. అయితే తాజాగా అలియా భట్, రాజమౌళికి షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న అలియా భట్.. చేతిలో ఉన్న సినిమాల వలన.. తెలుగులో రాజమౌళి చేసే ప్రాజెక్టులో నటించేందుకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని.. రాజమౌళి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఇక పారితోషికం తక్కువగా భావించి ఆమె అలా చెప్పివుంటుందనుకుని…. పారితోషికం పెంచడానికి కూడా రాజమౌళి టీం సిద్ధమైనా కూడా అలియా ఖాళీ లేదని… #RRR ఆఫర్ కి నో చెప్పేసిందట

Tags:    

Similar News