#RRR కోసం బాలీవుడ్ హీరోయిన్

దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం #RRR అనే సినిమాను చెక్కే పనిలో ఉన్నాడు.ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడాయి. రెండో షెడ్యూల్ [more]

Update: 2019-01-26 05:10 GMT

దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం #RRR అనే సినిమాను చెక్కే పనిలో ఉన్నాడు.ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడాయి. రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు అవుతున్న ఇంతవరకు హీరోయిన్స్ ఎవరు అనేది క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న.

తాజా సమాచారం ప్రకారం రాజమౌళి టీం బాలీవుడ్ నటి పరిణితి చోప్రాను సంప్రదించడం ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. రాజమౌళి సినిమా కాబట్టి కథ కూడా వినకుండా వెంటనే ఓకే చేసిందని చెబుతున్నారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈమెకు ఈమధ్య అంతగా కలిసి రావడంలేదు.

ఒక హీరోయిన్ ని బాలీవుడ్ నుండి మరో హీరోయిన్ ని టాలీవుడ్ తీసుకుంద్దాం అనుకున్న రాజమౌళి లేటెస్ట్ గా ఆ నిర్ణయం మార్చుకుని ఇద్దరినీ బాలీవుడ్ హీరోయిన్స్ నే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇక మూడవ ముద్దుగుమ్మగా ఒక హాలీవుడ్ నటిని ఎంపిక చేయబోతున్నారు.

Tags:    

Similar News