ఫస్ట్ లుక్ అంటే.. హడావిడి ఉండాలి.. కానీ..

రాజమౌళి #RRR ముచ్చట్లు మానేసి అన్న కొడుకు సింహ, కాల భైరవ మత్తువదలరా సినిమా ముచ్చట్లు చెబుతున్నాడు. గత వారం రోజులుగా మత్తువదలరా టీం తో ప్రమోషన్స్ [more]

Update: 2019-12-30 11:37 GMT

రాజమౌళి #RRR ముచ్చట్లు మానేసి అన్న కొడుకు సింహ, కాల భైరవ మత్తువదలరా సినిమా ముచ్చట్లు చెబుతున్నాడు. గత వారం రోజులుగా మత్తువదలరా టీం తో ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి… ఈ న్యూ ఇయర్ కి #RRR స్పెషల్ లుక్ కానీ టైటిల్ కానీ విడుదల చెయ్యబోతున్నాడంటూ… తెగ ప్రచారం జరుగుతుంది. గతంలో #RRR ప్రెస్ మీట్ పెట్టినప్పుడే.. ఫస్ట్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి ఇప్పుడు #RRR టైటిల్ కానీ.. లేదంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ల లుక్ కానీ విడుదల చేస్తాడంటూ.. ఓ న్యూస్ సోషల్ మీడియాని ముంచెత్తింది. సినిమా షూటింగ్ మొదలై ఏడాది గడిచినా సినిమా టైటిల్ విషయంలో రాజమౌళి చేసే తాత్సారం చూస్తుంటే…. ఆసలు #RRR టైటిల్ కొత్తగా పెడతారా… లేదంటే #RRR ని అలానే ఉంచేస్తారా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.

అయితే సోషల్ మీడియాలో #RRR ఫస్ట్ లుక్ అంటూ ప్రచారం జరుగుతుంటే కొందరు మాత్రం రేపు నైట్ కానీ, అంటే 31 నైట్ కానీ, జనవరి 1 న్యూ ఇయర్ రోజు కానీ #RRR ఫస్ట్ లుక్ విడుదల చేస్తే.. రాజమౌళి టీం నుండి మా ఫస్ట్ లుక్ ఉంటుందనో, లేదనో హీరోస్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ తమ సినిమా లుక్ విషయంలో స్పందించేవారు అని, ఫస్ట్ లుక్ విడుదల అంటే ఆ హంగామా మూడు రోజుల ముందే మొదలవుతుంది. జాతీయ మీడియాని ఆకర్షించాలంటే ఆ హంగామా కంపల్సరీ.. ఆ విషయం జక్కన్నకి తెలియంది కాదు. కానీ.. ఇంత నీరసంగా ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చెయ్యదు. ఏమైనా #RRR టైటిల్ రివీల్ విషయాలు ఉంటే ఈ సంక్రాంతికి ఉండొచ్చామో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. జులై 30 న విడుదల కాబోయే #RRR సినిమా ప్రమోషన్స్ ని రాజమౌళి పక్కా గా ప్లాన్ చెయ్యడంతో.. ఎలాంటి విషయాలు బయటికి పొక్కడం లేదని.. #RRR ప్రమోషన్స్ ని మంచి రోజు చూసి రాజమౌళి మొదలెడతాడేమో అనే టాక్ కూడా నడుస్తుంది. మరి ఈ న్యూ ఇయర్ కి #RRR ట్రీట్ ఉంటుందా? లేదా? అనేది రేపు మంగళవారం కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Tags:    

Similar News