గుడ్ న్యూస్: #RRR నుండి ఫస్ట్ లుక్ రాబోతుంది

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR చిత్రం ను రాజమౌళి తన స్టైల్ లో తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ రాజి పడకుండా పక్క ప్లాన్ తో షూటింగ్ [more]

Update: 2019-02-15 03:59 GMT

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR చిత్రం ను రాజమౌళి తన స్టైల్ లో తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ రాజి పడకుండా పక్క ప్లాన్ తో షూటింగ్ జరుపుతున్నాడు. స్టిల్స్ అండ్ లుక్స్ ఎక్కడ రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ లుక్స్ విడుదల చేసే ప్రక్రియ షురూ అయింది.

రీసెంట్ గా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి పనులు ముగించుకుని #RRR కి పని చేయడం స్టార్ట్ చేసాడు. ఈనేపధ్యంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే నెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక్కడిదే రెడీ చేయాలనేది టార్గెట్. అయితే కేవలం ఓ స్టిల్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారా లేక బాహుబలి టైపులో ఓ థీమ్ క్రియేట్ చేసి వీడియో విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

బాహుబలి ప్రమోషన్స్ విషయంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. స్టిల్స్ తో పాటు ప్రత్యేకంగా ఓ థీమ్ ను సెలక్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేసాడు. ఇప్పుడు #RRR విషయం సేమ్ 2 సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతాడో లేదో చూడాలి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇంకా హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ దాదాపు కంఫర్మ్ అయినట్టు టాక్.

Tags:    

Similar News