RRR లో ఎమోషనల్ సీన్స్ హైలెట్!!

రాజమౌళి దర్శకత్వంలో 70 శాతం పూర్తి చేసుకున్న RRR సినిమా షూటింగ్ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు మళ్ళీ షూట్ కి వెళ్లే పరిస్థితులు లేవని ఆ సినిమా [more]

Update: 2020-07-30 05:42 GMT

రాజమౌళి దర్శకత్వంలో 70 శాతం పూర్తి చేసుకున్న RRR సినిమా షూటింగ్ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు మళ్ళీ షూట్ కి వెళ్లే పరిస్థితులు లేవని ఆ సినిమా కెమేరామ్యాన్ సెంథిల్ చెప్పిన మాట. 500 నుండి 600 టెక్నీకల్ సిబ్బంది పనిచేసే సెట్స్ లో కేవలం 40 నుండి 50 మంది పనిచెయ్యాలి అనేది సవాల్ తో కూడుకున్న పనే. అయినా ప్రయత్నిద్దాం అనుకుంటే.. కరోనా ముదిరి పాకాన పడడంతో.. RRR ట్రయిల్ షూట్ కూడా గోవిందా అయ్యింది. అయితే వచ్చేయడాది జనవరి 8  కి RRR విడుదలవడం గగనమే. వచ్చే ఏడాది వేసవికైనా RRR వస్తుంది అంటే చెప్పలేం. అయితే రాజమౌళి లేట్ అయినా లేటెస్ట్ గా పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తోనే వస్తాడు కాబట్టి ఫాన్స్ కంగారు పడాల్సిన పని లేదు అని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు అనుకుంటున్నారు.

ఇక సినిమాలో అనుకోకుండా కలిసిన ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు స్నేహితుల్లాగే కాకుండా అన్నదమ్ములుగా ఆకట్టుకుంటారట. సినిమాలో కావాల్సినంతగా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది అని.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందట. ఇక పతాక సన్నివేశాలలో భీకరమైన పోరాటాలతో పాటు వీరిద్దరి మధ్యన నడిచే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయని.. యాక్షన్ సన్నివేశాలు ఎంతగా హైలెట్ అవుతాయో.. ఎమోషనల్ సన్నివేశాలు అంతే హైలెట్ అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News