#RRR లో ఆ ఇద్దరు కన్ఫర్మ్

రాజమౌళి తీర్చిదిద్దుతున్న మూవీ #RRR గురించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అందరు [more]

Update: 2019-03-24 10:34 GMT

రాజమౌళి తీర్చిదిద్దుతున్న మూవీ #RRR గురించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అందరు మంచి పేరున్న నటులే నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కాకుండా బాలీవుడ్ స్టార్ అజయ్‌ దేవగణ్‌ కూడా నటిస్తున్నట్టు ఇటీవలే రాజమౌళి ప్రెస్ మీట్ ప్రకటించాడు.

అలానే బాలీవుడ్ నుండి ఆలియా భట్ హాలీవుడ్ నుండి డైసీ ఎడ్గర్ జోన్స్‌లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ఇక వీరు కాకుండా మరికొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ను #RRR లో తీసుకోనున్నాడు రాజమౌళి. ప్రస్తుతం వారి పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్‌లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి వారిని సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

Tags:    

Similar News