#RRR ఆ సినిమా కాపీయా?

Update: 2018-06-02 08:20 GMT

రాజమౌళి రూపొందిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కోసం ఒక టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రలతో పాటు సినిమా కథ ఏంటనే అంశంపై చాలానే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

కొన్ని సీన్లే..

#RRR కథపై ఇప్పటికే చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా.. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే టాలీవుడ్ ని షేక్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ కథపై ఓ వార్త హల్ చల్ చేస్తుంది. కథ మొత్తం కాదు కానీ కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం అమెరికన్ గ్యాంగ్ స్టర్ అనే హాలీవుడ్ మూవీ నుంచి ఇన్ స్పిరేషన్ తీసుకున్నారట.

అన్నదమ్ములుగా ఎన్టీఆర్, రామ్ చరణ్..

అందులో కొన్ని సీన్స్ ను రాజమౌళి ఇన్స్పిరేషన్ గా తీసుకుని దానికి తగట్టే కథను రెడీ చేస్తున్నాడట. దాంతో అమెరికన్ గ్యాంగ్ స్టర్ కు.. ఈ చిత్రానికి దగ్గర పోలికలు పెద్దగా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇందులో అన్నయ పాత్రలో ఎన్టీఆర్..ఓ గ్యాంగ్ స్టర్ గా, తమ్ముడు పాత్రలో రామ్ చరణ్.. పోలీస్ గా విశ్వరూపం చూపించనున్నారట. ఫ్యామిలీలో జరిగే కొన్ని గొడవలు కారంగా ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా మారగా అతడితో పోటీ పడే తమ్ముడి రోల్ లో చెర్రీ యాక్ట్ చేయనున్నాడని అంటున్నారు.

Similar News