రోజా కనిపించడం లేదు!!

మొన్నామధ్యన నాకు జబర్దస్త్, రాజకీయాలు రెండు కళ్ళు.. నేను ఆర్ధిక సమస్యలతోనే జబర్దస్త్ చేస్తున్నాను.. అయినా మా నాయకుడు జగన్ కి లేని బాధ మీకెందుకు.. నేను [more]

Update: 2020-08-09 08:31 GMT

మొన్నామధ్యన నాకు జబర్దస్త్, రాజకీయాలు రెండు కళ్ళు.. నేను ఆర్ధిక సమస్యలతోనే జబర్దస్త్ చేస్తున్నాను.. అయినా మా నాయకుడు జగన్ కి లేని బాధ మీకెందుకు.. నేను జబర్దస్త్ చేస్తాను.. రాజకీయాల్లో బిజీ అయితే జబర్దస్ వదిలేస్తాను అంటూ ఫైర్ అయిన రోజా ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. నిన్న జబర్దస్త్ ఎపిసోడ్స్ లో మనో తో కలిసి హడావిడి చేసిన రోజా వచ్చే వారం జడ్జ్ స్థానంలో కనిపించలేదు. మరి రోజా రాజకీయాలతో బిజీగా ఉండి.. జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చిందో.. లేదంటే జగనన్న చెప్పాడని మానేసిందో కానీ వచ్చే గురు, శుక్రవారం జేడ్జ్ స్థానంలో రోజా ప్లేస్ లోకి డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూర్చున్నాడు.

నాగబాబు ఉన్నప్పుడు జడ్జ్ గా ఎప్పుడైనా బ్రేక్ తీసుకునే రోజా.. నాగబాబు జబర్దస్త్ వదిలేసాక మరో గెస్ట్ జడ్జి తో కలిసి జబర్దస్త్ ని ఒంటి చేత్తో నడిపిస్తుంది. అయితే తాజాగా రోజా జడ్జ్ గా కనిపించకపోయేసరికి.. మొన్నామధ్యన రోజా రాజకీయాలలో బిజీ అయితే జబర్దస్త్ మానేస్తా అంది. అన్నట్టుగా రోజా రాజకీయాల్లో బిజీ అయ్యిందా లేదంటే అంటూ అనుమానాలు మొదలు పెట్టారు. ఇక గత కొన్ని వారాలుగా జేడ్జ్ గా మనో వస్తున్నాడు. ఇప్పుడు రోజా ప్లేస్ లో శేఖర్ మాస్టర్ వచ్చాడు. గతంలోనూ శేకేర్ మాస్టర్ జేడ్జ్ గా వచ్చాడు.. కానీ ఈసారి రోజా లేకుండా శేఖర్ మాస్టర్ కనిపిస్తుంటే కాస్త కొత్తగా ఉంది. ఇక్కడే కాదు జీ తెలుగులోనూ బతుకు జెత్కా బండిలోనూ రోజా ప్లేస్ లో ఒక వారం జీవిత రాజశేఖర్ కనబడితే మరో వారం పోసాని కనిపిస్తున్నాడు.

Tags:    

Similar News