రోజా ఎక్కడ సారూ?

నాగబాబు – రోజా జెడ్జెస్ గా ఏడేళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జబర్దస్త్ కామెడి షో… తాజాగా నాగబాబు బయటికెళ్ళిపోయినా.. రోజా ఒంటి చేత్తో [more]

Update: 2020-03-28 14:46 GMT

నాగబాబు – రోజా జెడ్జెస్ గా ఏడేళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జబర్దస్త్ కామెడి షో… తాజాగా నాగబాబు బయటికెళ్ళిపోయినా.. రోజా ఒంటి చేత్తో జబర్దస్ ని నడిపిస్తుంది. నాగబాబు ఉండగా జబర్దస్త్ ని నడిపించినా… బాబు బయటికెళ్లినా రోజా మాత్రం సింగల్ హ్యాండ్ తో జబర్దస్త్ ని లీడ్ చేస్తుంది. ఓ పక్క అధికారంలో ఉండి పదవి వెలగబెతున్నప్పటికీ….. రోజా జబర్దస్త్ ని వదలడం లేదు. అయితే తాజాగా కరోనా దెబ్బకి అన్ని షూటింగ్స్ బంద్ అయినప్పటికీ….ముందుగా పూర్తి చేసిన జబరదాస్ ఎపిసోడ్స్ ని ఇప్పటికీ లేటెస్ట్ గా ఈ టివిలో ప్లే చేస్తున్నారు.

అయితే తాజాగా ప్లే అయినా జబర్దస్త్ ఎపిసోడ్ లో రోజా జేడ్జ్ గా కనిపించలేదు. శేఖర్ మాస్టర్, మనో జడ్జెస్ గా కనిపించారు కానీ.. రోజా ఎక్కడా కనబడలేదు. కరోనా కారణంగా నగరి లోనే తిష్ట వేసిన రోజా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కి జేడ్జ్ గా కనిపించలేదని అంటున్నారు. లాక్ డౌన్ కారణంగానే రోజా నగరిలోనే ఉండిపోయి.. హైదరాబాద్ కి రాలేకపోయింది కాబట్టి ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి రాలేదంటున్నారు. ఇక జబర్దస్త్ షూటింగ్ ఆగిపోవడంతో చిన్న చిన్న కమెడియన్స్ బాధ వర్ణనాతీతం. సుధీర్, రష్మీ, శ్రీను, భాస్కర్, రాఘవ, ఆది ఇలా పెద్ద కమెడియన్స్ కి పర్వాలేదు కానీ.. షూటింగ్స్ నిలిచిపోవడంతో చిన్న చిన్న కమెడియన్స్ బాధ మాత్రం వర్ణించడం కష్టం.

Tags:    

Similar News