ఇదేనా #RRR స్టోరీ లైన్ ?

రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ చిత్రం #RRR ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా నుండి ఇప్పటివరకు ఒక్క లుక్ కూడా రాకుండానే రోజుకో పుకారు వస్తుంది. ఈసినిమాలో [more]

Update: 2019-02-09 08:44 GMT

రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ చిత్రం #RRR ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా నుండి ఇప్పటివరకు ఒక్క లుక్ కూడా రాకుండానే రోజుకో పుకారు వస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల పాత్ర ఇదే అని కాదు ఇలా అని చాలా పుకార్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఇందులో రామ్ చరణ్ పోలీస్ పాత్ర లో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ ఏమో ముస్లిం యువకుడిగా కనిపించబోతతున్నాడట. ఇది పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని చెబుతున్నారు. పోయిన జన్మలో వీరిద్దరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటె..ఈ జమ్ములో ఒకరు ముస్లిం యువకుడిగా, వేరొకరు పోలీస్ గా జన్మిస్తారట. ఇలా ఈసినిమా పై పుకార్లు వస్తున్నాయి.

ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ రెస్ట్ లో ఉన్నాడు. 2020 సమ్మర్ లో ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.

Tags:    

Similar News