బోయపాటి - చరణ్ సినిమాకు హిందీలో భారీ రేట్

Update: 2018-05-12 16:35 GMT

రంగస్థలం భారీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్.. బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు నుండి బ్యాంకాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చరణ్.. కైరాపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు మూడు సాంగ్స్ కూడా అక్కడే షూట్ చేసి ఇక్కడికి రానున్నారు.

రామ్ చరణ్ మూవీస్ అంటే ఎప్పటి నుండో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అతని గత సినిమాలు.. హిందీ డబ్బింగ్ రేట్స్ మంచి రేట్స్ కె వెళ్ళింది. అయితే ఇప్పుడు చరణ్ - బోయపాటి సినిమా హిందీ అనువాద హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

ఓ నార్త్ ఇండియన్ కంపెనీ వాళ్లు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ సినిమా ఇంతలా రేట్ పలకడం ఇదే మొదటిసారి. చరణ్..కైరా అద్వాని ఇద్దరు బాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితులే. అందుకే ఈ సినిమాను అంత భారీ రేట్ కి కొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ తో పాటు..బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరాకి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల దగ్గరకి తీసుకుని రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Similar News