అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ ' భైరవ గీత'..!

Update: 2018-08-31 11:54 GMT

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథా చిత్రం 'భైరవగీత'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ రోజు ఆర్జీవీ రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్ లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్ లో కనపడుతుండడం విశేషం. ధనంజయ, ఇర్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్, క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేయబోతున్నారు.

Similar News