పైత్యం పరాకాష్టకు.. అంటే ఇదే..!

ఎవ్వరికీ అదరని, బెదరని వ్యక్తి ఇండస్ట్రీలో ఎవ్వరైనానా ఉన్నారు అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు వర్మ అంటే క్రేజ్. కానీ ఇప్పుడు వర్మ [more]

Update: 2019-04-08 08:50 GMT

ఎవ్వరికీ అదరని, బెదరని వ్యక్తి ఇండస్ట్రీలో ఎవ్వరైనానా ఉన్నారు అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు వర్మ అంటే క్రేజ్. కానీ ఇప్పుడు వర్మ అంటే పైత్యం. వర్మ మదిలో ఏ పురుగు ఎప్పుడు దూరుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. ఏం చెయ్యాలనుకుంటాడో అది చేసి చూపించేస్తాడు. వర్మ చేతికి సినిమా తియ్యమని ఇస్తే ఎలా ఉంటుందో గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయినా వర్మ నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగేలా వర్మ ప్లానింగ్ ఉంటుంది. దాంతో ప్రేక్షకులకు వర్మ సినిమా చూడాలనే ఫీలింగ్ వస్తుంది. చూసాక కానీ వర్మ పైత్యం తెలియదు. నిన్నగాక మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ తో అలాగే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పీక్స్ లో పుట్టించి చివరికి తుస్ మనిపించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వర్మకు జ్ఞానోదయం కలిగి సినిమాలను ఆపేస్తాడేమోలే అనుకుంటే.. మళ్లీ జయలలిత – శశికళ కాంబోలో బయోపిక్ అన్నాడు.

ఇప్పుడు నటనలోకి…

ఇక తాజాగా కోబ్రాతో నటుడి అవతారమెత్తాడు. కోబ్రా ఫస్ట్ లుక్ చూస్తుంటే వర్మ పైత్యానికి పరాకాష్ట అన్నట్టుగా ఉంది. కొన్నాళ్లుగా దర్శకుడిగా భరిస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు కోబ్రాలో నటుడిగా భరించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా దర్శకుడిగా వర్మని యాక్సెప్ట్ చెయ్యడం ఎప్పుడో మానేసిన ప్రేక్షకులు నటుడిగా ఏం యాక్సెప్ట్ చేస్తారు. బయట నిర్మాతలెవరూ వర్మతో సినిమాలు చెయ్యకపోతే తన కంపెనీ నిర్మాణంలోనే సినిమాలు చేసి ప్రేక్షకులకు పిచ్చెక్కించే వర్మ కోబ్రాలో విభిన్నంగా కనిపిస్తున్నాడు. అయినా ఈ వర్మ పైత్యాన్ని మనం ఎన్నాళ్లు భరించాలో అంటూ చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

Tags:    

Similar News