కొర‌టాల శివ అనే నేను ఏ సినిమా అయినా 'అంతః కరణ శుద్ధి' తో తీసి..

Update: 2018-04-20 05:32 GMT

మ‌హేష్‌బాబు - కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను ఇప్ప‌టికే అన్ని చోట్లా ఫ‌స్ట్ షోలు కంప్లీట్ చేసుకుని మంచి టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సినిమా విశ్లేష‌ణ విష‌యానికి వ‌స్తే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే ఇండియా వస్తాడు భరత్. తన తండ్రికి పిన తల్లికీ దూరంగా తల్లి చనిపోయిన చిన్నతనం లోనే విదేశం వెళ్ళిపోయి అక్కడే బతుకుతాడు. అసలు ఇండియా ఎలా ఉంటుందో కూడా భ‌ర‌త్‌కు తెలియ‌దు. సీఎంగా ఉన్న అత‌డి తండ్రి శ‌ర‌త్‌కుమార్ చనిపోవ‌డంతో ఆయన ఆఖరి చూపు కోసం ఇండియా వస్తాడు.

ఆ తరవాత సీఎం పదవి కోసం జరిగిన లాబీయింగ్ శ‌ర‌త్‌కుమార్‌కు బెస్ట్ ఫ్రెండ్‌ ప్రకాష్ రాజ్ నిర్ణయం తీసుకుని భరత్ నే ముఖ్యమంత్రిని చేస్తాడు. ఒక సిన్సియర్ కుర్రాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది ప్రధాన అంశంగా తీసుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. భరత్ ఈ సందర్భంగా ఎదురుకొన్న తలనొప్పులు ఏంటి, ఏ రకంగా ప్రజలు - మీడియా - విపక్షాలు అతనితో ఎదురు దాడికి దిగాయి అనేది భరత్ అనే నేను టోటల్ కథాంశం.

భరత్ తన స్థాయి చూపిస్తూ జనాల ఆశలు ఎలా నిలబెట్టాడు అనేది ప్రత్యేకంగా చెప్పుకునే పాయింట్. కమర్షియల్ సినిమా తీస్తున్నా ముఖ్యమంత్రితో ఫస్ట్ హాఫ్ లో ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా చేయించకుండా జాగ్రత్త తీసుకున్నాడు కొరటాల శివ. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా ప్లాన్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం హీరో ఎలేవేషన్, ఫైట్లు అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. మహేష్ బాబుకి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ దక్కింది. భరత్ అనే నేను టైటిల్ సాంగ్ అదిరిపోయింది. ప్రెస్ మీట్ సీన్లో ప్రేక్ష‌కుడు సైతం భావోద్వేగానికి గుర‌య్యేలా చేశాడు శివ. మహేష్ బాబు. డైలాగులు అదిరిపోయాయి. ఒక ముఖ్యమంత్రి పంచ్ డైలాగ్ చెబితే కామెడీగా అనిపించచ్చు కానీ కొరటాల శివ అలా అనిపించకుండా కుమ్మేసాడు.

ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ పాయింట్ ' కనక్షన్' ప్రేక్షకులు కోరుకునేది కేవలం ఎలేవేషన్ లు కాదు గట్టిగా కనక్ట్ అవ్వాలి .. అది అక్కడక్కడా మిస్ చేశాడు శివ. కథ బాగుంది కానీ కేవలం ఎలేవేషన్ మీదనే వెళ్ళిపోయింది మొత్తం స్టోరీ అంతా. సెకండ్ హాఫ్ కొన్ని బోర్ సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ ఇంకా బాగుండాల్సింది. లాజిక్ లు మిస్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ అసలు ఎందుకు ఉందొ కూడా తెలీదు.

ఎప్పుడూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తీసే కొరటాల శివ భరత్ అనే నేను సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు అయినా ఓవర్ ఆల్ గా ఈ సినిమా ప్ర‌జెంటేష‌న్ అయితే బాగుంది. కమర్షియల్ గా శ్రీమంతుడు రేంజ్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఈ సినిమా రేంజ్ డిసైడ్ చేస్తుంది. ఇక ద‌ర్శ‌కుడి విష‌యానికి వ‌స్తే కొర‌టాల శివ అనే నేను ఏ సినిమా అయినా 'అంతః కరణ శుద్ధి' తో తీసి తెలుగు సినిమా ప్రేక్షకులని గెలిపిస్తూనే ఉంటాను అన్న‌ది మ‌రోసారి ఫ్రూవ్ చేశాడు. రూ. 106 కోట్ల బ్రేక్ ఈవెన్ కోసం డిస్ట్రిబ్యూటర్ లు ఎదురు చూస్తున్నారు, మహేష్ బాబు స్థాయికి అది తక్కువే. ఏదేమైనా భ‌ర‌త్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్ చేసింది.

Similar News