ప్రభాస్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌..!

తెలుగులో అజాత శత్రువు, ఎవరినీ కించిత్తు కూడా బాధపెట్టని హీరో, సిగ్గరిగానే ఉంటూ ఎంతో ఫ్రెండ్లీగా మసలుకునే హీరోగా ‘బాహుబలి’తో నేషనల్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ [more]

Update: 2019-01-16 10:29 GMT

తెలుగులో అజాత శత్రువు, ఎవరినీ కించిత్తు కూడా బాధపెట్టని హీరో, సిగ్గరిగానే ఉంటూ ఎంతో ఫ్రెండ్లీగా మసలుకునే హీరోగా ‘బాహుబలి’తో నేషనల్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కి పేరుంది. నేడు ఏ హీరోయిన్‌ని అడిగినా ప్రభాస్‌తో ఓ చిత్రం చేయాలని ఉందని చెబుతూ ఉంటారు. ఇక ఈయన తన సహచరులని ఆప్యాయంతో క్లీన్‌బోల్డ్‌ కూడా సిద్దహస్తునిగా మారాడు. ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌కి ఎంతో సుపరిచితురాలైన శ్రద్దాకపూర్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రంలో జంటగా నటిస్తోంది. తన ప్రవర్తనపై కాస్త విమర్శలు ఉన్నా కూడా ఈమె ప్రభాస్‌కి ఫ్లాట్‌ కావడమే కాదు.. ప్రభాస్‌ని కూడా ఫ్లాట్‌ చేసే పనిలో ఉంది. ‘సాహో’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అబుదాబితో పాటు రామోజీ ఫిలింసిటీలో ఇటీవల వరకు షూటింగ్ జరిగింది. ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా శ్రద్దాకపూర్‌ పట్ల ప్రభాస్‌ ప్రత్యేక శ్రద్ద చూపాడు. దీంతో వారిద్దరు ఒక చిత్రం పూర్తి కాకముందే ఒకరికొకరు ఎంతో ఇష్టులుగా తయారయ్యారు.

సంక్రాంతి స్పెషల్ పంపించిందట…

ఇక్కడ షూటింగ్‌ జరిగినంత కాలం హైదరాబాద్‌కి చెందిన ప్రత్యేక వంటకాలను తన ఇంట్లో తయారు చేయించి మరీ ప్రభాస్‌ షూటింగ్‌లో శ్రద్దాకపూర్‌కి రుచి చూపిస్తూ వచ్చాడు. ప్రభాస్‌ తెప్పించిన ప్రత్యేక వంటకాలకు సంబంధించిన ఫొటోలను ఆ మధ్య శ్రద్దాకపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎంతో సంతోషంగా పంచుకుంది. ప్రస్తుతం ఆమె సంక్రాంతి కానుకగా తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్లింది. అంతేకాదు.. మరాఠీలకు ఎంతో సంప్రదాయమైన స్వీట్‌.. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అందరు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకునే నువ్వుల లడ్డు అదేనండీ మరాఠీ భాషలో తిల్‌గుల్‌ లడ్డూగా పేరొందిన వాటిని డార్లింగ్‌కి, ‘సాహో’ టీంకి ముంబై నుంచి ప్రత్యేకంగా పంపిందట. ఇలా ప్రభాస్‌కి ఆమె రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో హాలీవుడ్ యాక్షన్‌ థ్రిల్లర్‌కి ధీటుగా రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మరి తెర వెనుక ఎంతో కుశలంగా మసులుకుంటున్న ప్రభాస్‌-శ్రద్దాకపూర్‌ల జోడీ వెండితెరపై కూడా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉండటం ఖాయమని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ప్రభాస్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో అనుష్కతో పాటు శ్రద్దా కపూర్‌ కూడా చేరిందన్న మాట…!

Tags:    

Similar News