సుధీర్ ని పక్కనబెట్టి… ప్రదీప్ తో చాటింగ్?

సుధీర్ – రష్మీ ఆన్ స్క్రీన్ లవర్స్. ఆన్ స్క్రీన్ లో సుధీర్ – రష్మీ ల జోడి సూపర్ పాపులర్. వారిద్దరూ కలిసి షో చేస్తున్నారంటే [more]

Update: 2020-05-17 06:28 GMT

సుధీర్ – రష్మీ ఆన్ స్క్రీన్ లవర్స్. ఆన్ స్క్రీన్ లో సుధీర్ – రష్మీ ల జోడి సూపర్ పాపులర్. వారిద్దరూ కలిసి షో చేస్తున్నారంటే ఆ క్రేజే వేరు. అయితే ఆన్ స్క్రీన్ జోడి అయినా వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం కనీసం ఫ్రెండ్స్ కూడా కాదట. ఆ విషయం స్వయంగా రష్మినే చెప్పింది. సుధీర్ నేను బయట కేవలం పరిచయస్తుల్లానే ఉంటామని.. అంతేకాని బయట మేమిద్దరం ఎక్కువగా కలవమని చెబుతుంది.

ఇక తాజాగా కరోనా లాక్ డౌన్ తో రష్మీ కి ఢీ యాంకర్ ప్రదీప్ అయితే రోజు వీడియో చాటింగ్ చేస్తాడట. మరి సుధీర్ తో వీడియో చాటింగ్ చెయ్యవా రష్మీ అంటే.. లేదు సుధీర్ తో అసలు వీడియో కాల్ ఉండదని… కానీ ప్రదీప్ చేసిన వీడియో కాల్ గనక లిఫ్ట్ చెయ్యకపోతే.. ప్రదీప్ వెంటనే వీడియో మెసేజ్ పెట్టి.. ప్లీజ్ నా వీడియో కాల్ లిఫ్ట్ చేయి.. నువ్ లిఫ్ట్ చేయకపోతే నేను డిప్రెషన్‌లోకి వెళిపోతా.. ప్లీజ్ కాల్ మి బ్యాక్ అంటూ వీడియో చేసి పంపుతున్నాడు. ప్రదీప్ మాచిరాజు చాలా సరదాగా ఉంటాడు అని.. కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న ప్రదీప్ కి బోర్ మొదలైంది అంటున్నాడట. అయితే ఎప్పుడూ సుధీర్ తో ఎక్కువగా కనబడే రష్మీ ఇప్పుడు కొత్తగా ప్రదీప్ తో వీడియో చాటింగ్ అంటుంది.. అంటే సం థింగ్ సం థింగ్ అంటున్నారు.

Tags:    

Similar News