నిశ్చితార్ధం అయ్యిందా?

Update: 2018-06-24 12:26 GMT

హీరోయిన్ రేణు దేశాయ్.. మెగా హీరో పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లల్ని కన్నాక.. పవన్ కి రేణు దేశాయ్ మధ్యన వచ్చిన మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడిపోయాక మళ్ళీ అన్నా లెజెనోవా ని పెళ్లి చేసుకుని మరో సారి తండ్రి కూడా అయ్యాడు . కానీ రేణు దేశాయ్ పూణే లో పిల్లల్ని చదివించుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. అయితే ఆమెకి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు తనని బాగా చూసుకుని, తనని అర్ధం చేసుకునే ఒక తోడు ఉంటె బావుంటుందని చెప్పడం... అదికాస్తా ఇప్పుడు నిజమవడం జరిగాయి.

గత వారం రోజులనుండి రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటుందని ఆమె ఇచ్చిన లీకులతో సోషల్ ఇండియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అయితే పవన్ అభిమాని ఒకడు రేణు రెండో పెళ్లి విషయమై కామెంట్ చేస్తే అతనికి వాచిపోయేలా రేణు దేశాయ్ సమాధానమివ్వడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అయితే తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో రేణు దేశాయ్ తనకి నిశ్చితార్ధం జరిగిందా అనిపించేలా ... తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసి నిశ్చితార్థపు ఉంగరాలు ఉన్న చేతులున్న ఫోటోని పోస్ట్ చేసింది.

మరా ఫోటో చూసాకా... రేణుకి వేరెవరితోనో నిశ్చితార్ధం అయ్యిందని ఫిక్స్ అయ్యేలానే ఉంది. మరా ఫొటోతో పాటుగా... నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయితీ మనసుకు ధన్యవాదాలు అని రేణు పోస్ట్ చేసింది. అంటే నిజంగానే రేణు దేశాయ్ కి నిశ్చితార్ధం జరిగిందనే అనుకోవాలి. మరోపక్క రేణు దేశాయ్ తన రెండో పెళ్లి విషయంలో తనకు మద్దతుగా నిలిచినా పవన్ ఫాన్స్ కి కూడా ఆమె కృతఙ్ఞతలు తెలిపింది.

Similar News