తమన్నా పాత్ర కీలకం కానుందా

నిన్న సాయంత్ర రిలీజ్ అయిన సైరా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇది ఒక విజువల్ వండర్ అని ట్రైలర్ [more]

Update: 2019-09-19 08:10 GMT

నిన్న సాయంత్ర రిలీజ్ అయిన సైరా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇది ఒక విజువల్ వండర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఇందులో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు అని, అమితాబ్, విజయ సేతుపతి, సుదీప్, జగపతి పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది.

పాత్రలు చాలా కీలకం….

ముఖ్యంగా ఇందులో నయనతార, తమన్నా పాత్రలు చాలా కీలకం కాబోతున్నాయని ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. తమన్నా గురించి మాట్లాడుకుంటే ఇందులో ఆమె చెప్పిన ఓ డైలాగ్ ” లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు” వింటే ఈమెకు ఇందులో మంచి రోల్ ఇచ్చారని అర్ధం చేసుకోవచ్చు. డైలాగ్ పరంగా చూసుకుంటే నరసింహారెడ్డి భార్యగా కావాలని తపించే యువతిగా తమన్నా పాత్ర ఉంటుందనిపిస్తుంది. నయనతార – చిరు – తమన్నా మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుందని తెలుస్తుంది. బాహుబలి తరువాత సైరా లో అంతటి పాత్ర చేస్తున్న తమన్నా ఎలా అలరిస్తుంది చూడాలి.

 

Tags:    

Similar News