మెగా అయితే నాకేంటి? స్టార్ అయితే నాకేంటి?

మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ ఎదురు చూస్తుంటారు. కారణం మెగా ఫ్యామిలిలో ఒక్క హీరో తో ఛాన్స్ వస్తే.. అందులోనున్న మరో ముగ్గురు [more]

Update: 2020-06-21 02:29 GMT

మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ ఎదురు చూస్తుంటారు. కారణం మెగా ఫ్యామిలిలో ఒక్క హీరో తో ఛాన్స్ వస్తే.. అందులోనున్న మరో ముగ్గురు నలుగురు మెగా హీరోల సినిమాలో అవకాశాలు పట్టొచ్చు. అదీ హీరోయిన్స్ ఆశ. కానీ ఇప్పుడు ఓ హీరయిన్ మెగా హీరో అయితే నాకేంటి.. స్టార్ హీరో అయితే నాకేంటి అంటుంది. ఆమె ఎవరో కాదు.. మెగా హీరో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఒప్పుకుని పెద్ద తప్పు చేసి ఇప్పుడు బాధపడుతున్న కీర్తి సురేష్. మహానటి తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కీర్తి సురేష్ మెగా హీరోల ఆఫర్స్ ని రిజెక్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

అల్లు అర్జున్ ఐకాన్ సినిమాలో కీర్తి సురేష్ కి అవకాశంవచ్చిందట. అంతేకాదు.. సాయి ధరమ్ సినిమాలోనూ కీర్తి సురేష్ ని సంప్రదించారట. కానీ కీర్తి సురేష్ ఇద్దరు మెగా హీరోలకు నో చెప్పేసిందట. కారణం అల్లు అర్జున్ ఐకాన్ లో పరిధి దాటి గ్లామర్ షో చెయ్యాలని.. సాయి ధరమ్ సినిమాలో తన పాత్రకి ప్రాధాన్యత లేని కారణంగా కీర్తి సురేష్ ఆ రెండు మెగా ఆఫర్స్ ని వదిలేసింది. ఎంత పెద్ద స్టార్స్ అయినా మితి మీరిన గ్లామర్ షో కానీ, నా పాత్రకి ప్రాధాన్యత లేకపోతె నేను సినిమాలు ఒప్పుకోను అంటుంది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ కి స్టార్ హీరో మహేష్ – పరశురామ్ కాంబో మూవీ సర్కారు వారు పాట లో నటించే అవకాశం వచ్చింది.

Tags:    

Similar News