సైరాకి ఆల్ ద బెస్ట్ చెప్పవా రెహ్మాన్

మెగాస్టార్ చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. రామ్ చరణ్ నిర్మతగా సైరా సినిమా ఎనౌన్స్ మెంట్ అపుడు సైరా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ [more]

Update: 2019-10-02 06:48 GMT

మెగాస్టార్ చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. రామ్ చరణ్ నిర్మతగా సైరా సినిమా ఎనౌన్స్ మెంట్ అపుడు సైరా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ పేరును అధికారికంగా ప్రకటించింది సైరా చిత్ర బృందం. అయితే అప్పట్లోనే ఏ ఆర్ రెహ్మాన్ సైరా సినిమా మోషన్ పోస్టర్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇవ్వలేదు. కారణం ఆయనకి ఖాళీ లేదని చెప్పారు. సైరా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ ఎస్ ఎస్ థమన్ వచ్చాడు. తర్వాత కొన్ని రోజులకి ఏ ఆర్ రెహ్మాన్ సైరా మ్యూజిక్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారు. కారణాలు తెలియవు కానీ రెహ్మాన్ బిజీ షెడ్యూల్ వలన సైరా నుంచి తప్పుకున్నారనే టాక్ నడిచింది. తర్వాత చిత్ర బృందం కానీ, రెహ్మాన్ కానీ సైరా విషయంలో స్పందించలేదు.

రెహ్మాన్ ఏమనుకుంటున్నారో…?

చాలా రోజులకి సైరాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేది వచ్చాడు. అయన సైలెంట్ గా సైరా కి మ్యూజిక్ ఇచ్చేసాడు. సైరా మేకింగ్ వీడియోలోనూ, ట్రైలర్ లోను అమిత్ త్రివేది మ్యూజిక్ బాగా హైలెట్ అయ్యింది. జూలియస్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయితే సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సైరా సినిమా సక్సెస్ అవ్వాలని చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటే… మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా వార్తలో నిలిచిన ఏ ఆర్ రెహ్మాన్ మాత్రం సైరా చిత్ర బృందానికి కనీసం ఆల్ ద బెస్ట్ కూడా చెప్పడం లేదు.

 

 

Tags:    

Similar News