వయసు రాగానే సై అంటుందట..!

Update: 2018-09-01 08:12 GMT

టాలీవుడ్ లో ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేని భామ రెజినా కాసాండ్రా. 'జ్యో అచ్యుతానంద, కొత్తజంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి చిత్రాల్లో అందాలు ఆరబోసినా అమ్మడుకి కెరీర్ ని మలుపుతిప్పే పాత్ర మాత్రం పడడం లేదు. అందుకే కోలీవుడ్ లో లక్కు పరీక్షించుకుని అక్కడ హిట్ కొట్టి ఇక అక్కడే సెటిల్ అయ్యేలాగా కనబడుతుంది. ఎందుకంటే చంద్రమౌళి సినిమా హిట్ తర్వాత రేజీనాకి కోలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.కోలీవుడ్ లో ఇప్పడు రేజీనాకి నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయంటే అమ్మడు ఎంత బిజీనో తెలుస్తోంది. ప్రస్తుతం రెజినా నటించిన హారర్‌ మూవీ ‘7’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ '7' మూవీ ప్రమోషన్స్ లో రెజినా తన పెళ్లిపై, గ్లామర్ షో పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి ఆలోచనైతే ఉంది కానీ.. ఆ పెళ్లి ఘడియలొచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ రెజినా పెళ్లి గురించి సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

అవసరం మేరకే అందాల ఆరబోత

ప్రస్తుతం 28 ఏళ్లున్న రెజినా పెళ్లి చేసుకునే వయసులోనే పెళ్లి చేసుకుంటానని... కానీ ఆ ఘడియలు వస్తే తప్పక పెళ్లవుతుందని చెబుతుంది. అలాగే సినిమాల్లో అవసరం మేరకు అందాలు ఆరబోతకు దిగుతానని... అలాగే గ్లామర్ షోకి తానెలాంటి వ్యతిరేకిని కాదని చెబుతోంది. మరి టాలీవుడ్ కన్నా ఎక్కువగా కోలీవుడ్ లో ఒకింత అందాలు ఎక్కువే ఆరబోసింది రెజినా. అందుకే అమ్మడుకి అక్కడ వరస అవకాశాలు తగులుతున్నాయి.

Similar News