మరీ ఇంత స్పైసినా?

టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ‘ఎవరు’ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ రెజినా కాసాండ్రా. ఎన్నో రోజులనుండి కెరీర్ లో బ్రేకిచ్చే సినిమా కోసం ఎదురు [more]

Update: 2019-08-17 07:43 GMT

టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ‘ఎవరు’ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ రెజినా కాసాండ్రా. ఎన్నో రోజులనుండి కెరీర్ లో బ్రేకిచ్చే సినిమా కోసం ఎదురు చూస్తుంది ఈ భామ. కెరీర్ ఆరంభంలో చాలా పద్దతిగా కనిపించిన రెజీనా అవకాశాలు సన్నగిల్లడంతో.. గ్లామర్ చూపించడం మొదలుపెట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో నటించినా, సందీప్ కిషన్ పక్కన నటించినా.. అమ్మడుకి అస్సలు క్రేజ్ రాలేదు. ఇక టాలీవుడ్ లో కెరీర్ ముగిసిపోయే టైం లో కోలీవుడ్ కి చెక్కేసి అక్కడ అందాలు ఆరబోస్తూ కాస్త సక్సెస్ అయ్యింది. ఇక టాలీవుడ్ విలన్ కమ్ హీరో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది. ‘ఎవరు’ సినిమా సక్సెస్ మీద భారీ ఆశలు పెట్టుకున్న రేజీనాకి ఆ సినిమా కావాల్సినంత సక్సెస్ తెచ్చిపెట్టింది.

‘ఎవరు’ సినిమా మొత్తం రెజినా చుట్టు తిరిగేలా దర్శకుడు కథ రాసుకున్నాడు. ఇక సినిమాలో రెజినా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే రెజినా కూడా గ్లామర్ గా చాలా స్పైసీ గా కనిపించింది. సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన రెజినా ‘ఎవరు’ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మీడియా కి స్పెషల్ ఇంటర్వూస్ ఇస్తుంది. ఇక తాజాగా జరిగిన ‘ఎవరు’ ఈవెంట్ కి రెజినా అదిరిపోయే గ్లామర్ డ్రెస్ తో క్లివేజ్ అందాలతో అదరగొట్టేసింది. ఎక్కువగా ఇలాంటి స్పైసీ అందాలు మనకి బాలీవుడ్ భామల విషయంలో నిత్యం దర్శనమిస్తాయి. కానీ రెజినా మాత్రం నాకేం తక్కువ నేను రెచ్చిపోతా.. అంటూ గ్లామర్ ని అలవోకగా చాలా హాట్ అండ్ స్పైసీ గా ఆరబోసింది. మరి రెజినా నీకింత స్పైసీ నెస్ అవసరమా… అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News