చరణ్ ఒప్పుకున్నాడు.. సైరాకు దెబ్బ దానివల్లే

భారీ అంచనాల మధ్య ఇండియా వైడ్ రిలీజ్ అయిన చిత్రం సైరా. ఈ చిత్రం హిందీ లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ [more]

Update: 2019-10-28 07:53 GMT

భారీ అంచనాల మధ్య ఇండియా వైడ్ రిలీజ్ అయిన చిత్రం సైరా. ఈ చిత్రం హిందీ లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమాకి పోటీగా హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ నటించిన వార్ కూడా రిలీజ్ అయింది. అందుకే సైరాకు అక్కడ కలెక్షన్స్ తగ్గాయని ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

అందుకే అలా తగ్గింది…..

రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడంతో ‘సైరా’ కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని తేల్చేశాడు రామ్ చరణ్. “హిందీలో ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండాల్సింది. వార్ 300 కోట్లు వసూలు చేస్తే సైరా సౌత్ లోనే దాదాపు రూ. 275 కోట్లు వసూలు చేసింది” అన్నాడు. చరణ్ ఏమో ఇలా అంటుంటే విశ్లేషకుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. హిందీలో సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే నష్టాలు వచ్చాయని…పైగా చిరు నార్త్ లో పెద్ద స్టార్ కాకపోవడం వల్లే కలెక్షన్స్ తగ్గాయని అభిప్రాయపడుతున్నారు.

 

 

Tags:    

Similar News