ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే..!

అఖిల్ కెరీర్ మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మొదటి సినిమాతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న అఖిల్ తర్వాత సినిమాతో కూడా నిరాశపరిచాడు. విక్రమ్ [more]

Update: 2019-02-01 11:41 GMT

అఖిల్ కెరీర్ మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మొదటి సినిమాతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న అఖిల్ తర్వాత సినిమాతో కూడా నిరాశపరిచాడు. విక్రమ్ కుమార్ తో చేసిన హలో చిత్రం కొంచం పర్లేదు అనిపించుకున్నా జనాలు ఆదరించలేకపోయారు. ఇక ఎటువంటి కాంపిటీషన్ లేకుండా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా నిరాశపరచడంతో ఇక అఖిల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనా అని కామెంట్స్ వస్తున్నాయి. అఖిల్ సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అఖిల్ ని స్టార్ హీరోలా ప్రొజెక్ట్ చేయడం, అఖిల్ కు సపరేట్ ఫ్యాన్స్ లేకపోవడం, కథలు ఎంచుకునే విషయంలో తప్పులు..ఇలా అన్ని విధాలుగా అఖిల్ ఫెయిల్ అవుతున్నాడు.

ఇప్పటికైనా తెలుసుకుంటాడా..?

కథల విషయంలో కొంత జాగ్రత్తపడితే సక్సెస్ పెద్ద విషయం కాదు. చాలా రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకి చిరాకు తెపిస్తున్నాడు. కొంచం కొత్తగా అలోచించి విజయ్ దేవరకొండ, నిఖిల్, వరుణ్ తేజ్ తరహాలో కొత్తగా సినిమాలు చేస్తే సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అఖిల్ ఈ ఫెయిల్యూర్ల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటాడో వేచి చూడాలి. మిస్టర్ మజ్ను తరువాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు. నెక్స్ట్ వేసే స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News