‘ముద్ర’ అందుకే వాయిదా పడింది..!

Update: 2018-10-26 08:23 GMT

విభిన్న కథలతో.. కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులని థ్రిల్ చేస్తూ ఉంటాడు యంగ్ హీరో నిఖిల్. త్వరలో సరికొత్త కాన్సెప్ట్ తో నిఖిల్ ‘ముద్ర’ అనే సినిమా ద్వారా మన ముందుకు రానున్నాడు. నిజానికి ఈ సినిమా నవంబర్ 8న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది వాయిదా పడినట్టు తెలుస్తుంది. దానికి కారణం అదే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాకపోయినా వీటి ప్రభావం ఈ చిత్రంఫై పడుతుందని ఆలోచిస్తున్నారట. అందుకే సినిమాను వాయిదా వేసినట్టు సమాచారం. విజయ్ - మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’ నవంబర్ 6న తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతుంది. తమిళం తో పాటు తెలుగులో మురగదాస్ కి, విజయ్ కి మంచి క్రేజ్ ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

పోటీ ఎక్కువగా ఉండటంతోనే...

ఈ సినిమా విడుదల అయిన తరువాత సరిగా రెండు రోజుల తరువాత నవంబర్ 8న అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అమీర్ ఖాన్, అమితాబ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు సినిమాలతో పోటీ ఎందుకని 'ముద్ర'ను వాయిదా వేసి సరైన సమయంలో థియేటర్లలోకి తీసుకురావలని నిర్మాత ఠాగూర్ మధు భావిస్తున్నారు.

Similar News