‘సీత’ అందుకే వాయిదా పడింది..!

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’ రిలీజ్ వాయిదా పడింది. ఈనెల 25న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. [more]

Update: 2019-04-22 07:37 GMT

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’ రిలీజ్ వాయిదా పడింది. ఈనెల 25న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. అదే రోజు హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుండంతో ఈ సినిమా వాయిదా వేసినట్టు సమాచారం. అలానే ఈ శుక్రవారం రిలీజ్ అయిన ‘జెర్సీ’, ‘కాంచన 3 ‘ ఇంకా స్ట్రాంగ్ గా థియేటర్స్ లో నడుస్తుండడంతో ‘సీత’ కి థియేటర్స్ దొరకడం లేదు.

వచ్చే నెలకు వాయిదా

అందుకే టీం ఈ సినిమా ను వచ్చే నెలకు వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై ఓఫీషియల్ అనౌన్సమెంట్ రానుంది. ఇక ఈ చిత్రంలో మన్నార చోప్రా, సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 18 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్.

Tags:    

Similar News