తారక్ ఆనందానికి కారణం ఇదే..!

పటాస్ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. అనిల్ రావిపూడి వచ్చి సూపర్ హిట్ ఇచ్చి కళ్యాణ్ రామ్ కెరీర్ ను ముందుకు [more]

Update: 2019-03-02 08:33 GMT

పటాస్ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. అనిల్ రావిపూడి వచ్చి సూపర్ హిట్ ఇచ్చి కళ్యాణ్ రామ్ కెరీర్ ను ముందుకు నెట్టాడు. ఆ తరువాత వచ్చిన ఇజం, ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాలు డిఫెరెంట్ జానర్స్‌ అయినప్పటికీ డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి. హిట్ కోసం తహతహలాడుతున్న కళ్యాణ్ కు తమ్ముడు తారక్ కూడా తోడు ఉన్నాడు. ఇక తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ తీసుకుని కళ్యాణ్ చేసిన ‘118’ మూవీ.. పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. మీడియా నుండి రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి.

కళ్యాణ్ రామ్ ను మెచ్చుకున్న తారక్

అయితే విషయం తెలుసుకున్న తారక్ వెంటనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఆఫీసుకు బయలుదేరి.. కళ్యాణ్ దగ్గర వాలిపోయాడు. ‘అన్నయ్యా ఈసారి అదరగొట్టేశావ్ పో‘ అంటూ కళ్యాణ్‌ని మెచ్చుకున్నాడు. తారక్ కు అరవింద సమేత హిట్ అవ్వడం…కళ్యాణ్ 118 హిట్ కావడంతో.. ఇలా బ్యాలెన్స్ అయిందని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇద్దరు ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనతో పాటు నివేత థామస్ నటన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News