రాయలసీమ బిడ్డగా.!

టాలీవుడ్ గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీత్ గ్లామర్ రేంజ్ ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో రకుల్ పేజీ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. బికినీ షో, క్లివేజ్ షో.. [more]

Update: 2020-12-19 11:04 GMT

టాలీవుడ్ గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీత్ గ్లామర్ రేంజ్ ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో రకుల్ పేజీ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. బికినీ షో, క్లివేజ్ షో.. అబ్బో జిమ్ డ్రెస్సుల్లోనూ రకుల్ ఏక్కడ తగ్గదు. అందులోని జీరో సైజు వర్కౌట్స్ తో రకుల్ ఎప్పుడూ గ్లామర్ తోనే వెలిగిపోతుంది. జిమ్ డ్రెస్ అయినా, చీర కట్టు అయినా రకుల్ అందాల ఆరబోత సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ తో దూసుకుపోయిన రకుల్ కి టాలీవుడ్ లో స్పీడు బ్రేకులు బాగానే తగిలాయి. అయినా బాలీవుడ్ సినిమాలే నమ్ముకుని కెరీర్ లో ముందుకెళుతున్న రకుల్ ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిన ఓ ‘లో’ బడ్జెట్ మూవీలో నటించింది. ఆ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో.

లాక్ డౌన్ ముగియగానే సినిమా మొదలు కావడం 45 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ కావడం జరిగింది. కానీ దర్శకుడు క్రిష్ ఈ సినిమాపై సైలెంట్ గా ఉంటున్న సమయంలో రకుల్ ఆ సినిమా ముచ్చట్లను ఓ ఇంటర్వ్యూ లో అభిమానులతో పంచుకుంది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే చేస్తుంటే ఓ ముద్ర పడిపోతుంది. ఈ హీరోయిన్ గ్లామర్ షో కి తప్ప మరెందుకు పనికి రాదంటారు. కానీ అప్పుడప్పుడు డీ గ్లామర్ పాత్రలు చెయ్యాలి. అలానే నేను మొదటిసారిగా క్రిష్ సినిమాలో డీ గ్లామర్ పాత్ర లో నటించాను అంతేకాదు.. మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడానని.. ఈ సినిమాలోని డీ గ్లామర్ పాత్ర తనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది అని చెబుతున్నది. అప్పుడప్పుడు ఇలాంటి పాత్రలు ట్రై చేస్తుండాలి అంటూ క్రిష్ సినిమాలో తన కేరెక్టర్ ఓబులమ్మ గా ఉండబోతుంది అని రివీల్ చేసేసింది.

Tags:    

Similar News