రవితేజ నిర్ణయంతో..ఆమెకు షాక్..!

Update: 2018-11-28 06:30 GMT

ప్రస్తుతం హీరో రవితేజ పరిస్థితి అంతగా బాగోలేదు. వరుసగా మూడు సినిమాలతో ఫ్యాన్స్ నిరాశపరచడమే కాదు ఆయన కూడా డీలాపడిపోయాడు. దీంతో ఆయన తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవి ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇందులో రవికి జోడిగా 'సమ్మోహనం'తో అలరించిన నభా నటేశ్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిపోయిందని అన్నారు. మరో హీరోయిన్ గా 'ఆర్ ఎక్స్ 100'తో పాయల్ రాజ్ పుత్ ఎంపిక చేసుకున్నారు.

రవితేజ చెప్పడంతో...

అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ సూచనతో 'టాక్సీవాలా' హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ని తీసుకోవాలని చెప్పాడట. ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఆమెను తీసుకోమని డైరెక్టర్ కు రవి సజెస్ట్ చేశాడట. నభా నటేశ్ ప్లేస్ లో ప్రియాంక జవాల్కర్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. రవితేజ నిర్ణయంతో పాయల్ కి పెద్ద సినిమా ఆఫర్ పోయిందనే చెప్పాలి. త్వరలోనే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.

Similar News