ఎఫ్ 3 లో రవితేజ కాదా.. మరి?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దానికి సీక్వెల్ చెయ్యడానికి దర్శకనిర్మాతలైన అనిల్ రావిపూడి – దిల్ రాజులూ సిద్ధమైపోయారు. [more]

Update: 2020-12-15 08:37 GMT

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. దానికి సీక్వెల్ చెయ్యడానికి దర్శకనిర్మాతలైన అనిల్ రావిపూడి – దిల్ రాజులూ సిద్ధమైపోయారు. వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ ని వదిలింది టీం. అందులో వెంకటేష్ – వరుణ్ తేజ్ లు మనీ ట్రాలీ తో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఎఫ్ 3 మొత్తం డబ్బు చుట్టూ నే తిరుగుతుందని ఆ కాన్సెప్ట్ పోస్టర్ తోనే అర్ధమైపోయింది. మరి ఎఫ్ 3 లో వెంకీ – వరుణ్ లతో పాటుగా మరో హీరో ఉంటాడని ఆ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడనే న్యూస్ ఉంది.

రవితేజ – వెంకీ – వరుణ్ ల ఎఫ్ 3 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మాములుగా ఉండదని ప్రచారం జరిగింది. తాజాగా రవితేజ కాదు.. యాక్షన్ హీరో గోపీచంద్ ఎఫ్ 3  లో మరో హీరో గా నటించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి గోపీచంద్ ని సంప్రదించాడని.. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కూడా ఈ ప్రపోజల్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకున్నాడనే టాక్ న్యూస్ నడుస్తుంది. మరి ఎఫ్ 3 లో అసలు మరో హీరో ఉంటాడా? ఉంటె అది రవితేజానా లేదంటే గోపీచంద్ నా అనేది అనిల్ రావిపూడి స్పందిస్తేనే కానీ తెలియదు.

Tags:    

Similar News