ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ ఇస్తాడు..?

సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రవితేజ మార్కెట్ కూడా పడిపోయింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు తన నెక్స్ట్ మూవీ ‘డిస్కోరాజా’ హిట్ అవ్వడం చాలా అవసరం. వీఐ [more]

Update: 2019-05-05 12:11 GMT

సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రవితేజ మార్కెట్ కూడా పడిపోయింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజకు తన నెక్స్ట్ మూవీ ‘డిస్కోరాజా’ హిట్ అవ్వడం చాలా అవసరం. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పటి నుండో రూపొందుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది అనుకుంటే సినిమా షూటింగు ఆగిపోయిందని టాక్ గట్టిగా నడుస్తుంది.

లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు

హెవీ బడ్జెట్ అవుతుండంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే దొరికిందే సందు అనుకుని రవితేజతో తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ లిస్ట్ లో అజయ్ భూపతి, గోపీచంద్ మలినేని, సంపత్ నంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తమ దగ్గరున్న కథలతో ఈ దర్శకులు రవితేజని ఒప్పించడానికి చాలానే ట్రై చేస్తున్నారట. మరి ఈ ముగ్గురిలో రవితేజను ఎవరు ఒప్పిస్తారో.. ఎవరితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళతాడో చూడాలి. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది. బడ్జెట్ కూడా చాలా తక్కువ అయ్యేలా చూడాలని రవితేజ వీరికి ముందుగానే కండిషన్ పెట్టాడట.

Tags:    

Similar News