ట్రెండ్ ని ఫాలో అవుతున్న రవితేజ..!

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజకి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. రెగ్యులర్ కథలు, ఫ్లాప్ డైరెక్టర్స్ ని ఎంచుకోవడమే అందుకు కారణం. ఈ [more]

Update: 2019-04-22 06:11 GMT

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజకి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. రెగ్యులర్ కథలు, ఫ్లాప్ డైరెక్టర్స్ ని ఎంచుకోవడమే అందుకు కారణం. ఈ మధ్య మన టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తుంది. అదే హీరో పాత్రకి ఏదో ఒక డిజార్డర్ ఉండడం. ఆ డిజార్డర్ తెరపై పండితే దాని గురించి జనం మాట్లాడుకుని సినిమాని హిట్ చేస్తారు. ఇటువంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసాయి. అందుకే రవితేజ ఇప్పుడు అటువంటి ఓ సబ్జెట్ ఎంచుకున్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితిల్లో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ‘డిస్కోరాజా’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

బిగుసుకుపోతాడట…

వైవిధ్యమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోందని తెలుస్తోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన తెరపై కనిపించనున్నాడు. అయితే ఇందులో ఒక పాత్రకి విచిత్రమైన ఒక డిజార్డర్ ఉంటుందట. కీలకమైన సమయాల్లో ఆ పాత్ర ఒక్కసారిగా బిగుసుకుపోతుందట. అసలు అటువంటి డిజార్డర్ రవితేజకు ఎందుకు వచ్చింది? దాని వల్ల రవితేజ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రవితేజ వివిధ గెటప్స్‌ లో కనిపించనున్నారు. ఇక రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్, ప్రియాంక జవాల్కర్ కంఫర్మ్ అయ్యారు.

Tags:    

Similar News