సేమ్ స్టోరీనేనటగా

వరస డిజాస్టర్స్ తరువాత మాస్ రాజా రవితేజ ఎన్నో హోప్స్ పెట్టుకుని చేస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’.వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రవితేజ చాలా కాలం తరువాత [more]

Update: 2019-08-07 08:14 GMT

వరస డిజాస్టర్స్ తరువాత మాస్ రాజా రవితేజ ఎన్నో హోప్స్ పెట్టుకుని చేస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’.వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రవితేజ చాలా కాలం తరువాత కోమా నుండి తిరిగి బయటకి వచ్చే వ్యక్తి పాత్ర చేస్తున్నాడు. రవితేజ కోమాలోకి వెళ్ళకముందు, వచ్చిన తరువాత చాలా మార్పులు చేసుకుంటాయి. సాంకేతికంగా వచ్చిన మార్పులు లకి రవితేజ ఎలా అడ్జస్ట్‌ అయ్యాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది ‘డిస్కో రాజా’ స్టోరీ.

తమిళంలోనూ…..

సేమ్ ఇటువంటి స్టోరీ తోనే తమిళంలో జయం రవి వస్తున్నాడు. ఇందులో కూడా హీరో కోమా నుండి బయటకు వచ్చిన తరువాత అతని చుట్టూ జరిగిన మార్పులు ఎలా డీల్ చేస్తాడు? ఏవిధంగా అడ్జస్ట్‌ అయ్యాడు అనేదే సినిమా. కాకపోతే ఇది పూర్తి కామెడీ గా తీసిన సినిమా అని రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈమూవీ కి ‘కోమాలి’ అని టైటిల్ పెట్టారు. ఇక ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది కాబట్టి దీన్ని తెలుగులోకి కూడా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై…..

ఒకవేళ ఇది తెలుగు లో రిలీజ్ అయితే ‘డిస్కో రాజా’ కాన్సెప్ట్‌లోని కొత్తదనం మన ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశముండదు. పైగా డిస్కోరాజా డిసెంబర్ వరకు రిలీజ్ అవ్వదు. ఒకవేళ ఈలోపే ‘కోమాలి’ రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ ‘డిస్కో రాజా’ తో పాటు రవితేజ కెరీర్ పై కూడా పడనుంది.

Tags:    

Similar News