తెరి రీమేక్ పై రవితేజ క్లారిటీ ఇచ్చాడు!

Update: 2018-11-15 06:08 GMT

తమిళంలో సూపర్ హిట్ అయినా విజయ్ సినిమా 'తెరి'ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు మైత్రి మూవీ సంస్థ వారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అనుకున్నారు కానీ తమిళ నేటివిటీ ఎక్కువ ఉండటంతో తెలుగు వాళ్లకి నచ్చే విధంగా మార్పులు చేయాలని అనుకుని స్క్రిప్ట్ మొత్తం రెడీ చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన సినిమాలు చేసే పరిస్థితిల్లో లేరు. అదే కథను రవితేజ తో తీయాలని భావించారు. అందుకు తగట్టు రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగట్టు స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి ‘నేలటికెట్’ విడుదలకు ముందు ఒక ఫైట్ కూడా తీశారు. మరి ఏం అయిందో తెలియదు కానీ అక్కడితో సినిమా ఆగిపోయింది. ఆ తరువాత రవితేజ శ్రీను వైట్ల డైరెక్షన్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చేశాడు. ఈ సినిమా విడుదలకు రెడీ ఉంది.

అది రీమేక్ కాదు...

ఈ సందర్భంగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."సంతోష్ శ్రీనివాస్ తో సినిమా నిజమేనని కానీ అది రీమేక్ కాదని.. కొత్త కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని అయన తెలిపాడు". దీంతో 'తెరి' రీమేక్ కు బ్రేక్ పడినట్టు అయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ సినిమాల ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించబోయే సినిమా గురించి రవితేజ మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడనని.. తరువాత మాట్లాడతానని చెప్పాడు.

Similar News