రెమ్యూనరేషన్ తగ్గించిన రవి తేజ

హీరోలందరిలో హిట్స్ తో ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఎనెర్జీతో సినిమాలు చేసే రవితేజ అంటే దర్శకనిర్మాతలకు మినిమం గ్యారెంటీగా ఉండేవి. అందుకే రవితేజతో సినిమా చెయ్యాలన్నా… [more]

Update: 2018-12-27 03:54 GMT

హీరోలందరిలో హిట్స్ తో ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఎనెర్జీతో సినిమాలు చేసే రవితేజ అంటే దర్శకనిర్మాతలకు మినిమం గ్యారెంటీగా ఉండేవి. అందుకే రవితేజతో సినిమా చెయ్యాలన్నా… రవితేజ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చెయ్యాలన్నా పెద్ద క్యూ ఉండేది. కానీ ప్రస్తుతం రవితేజ కు వస్తున్న వరస ఫ్లాఫ్ లు ఆ సీన్ ను రివర్స్ చేసేసాయి. రవితేజ మాస్ మాస్ అంటూ చేస్తున్న మసాలా సినిమాలని ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. ఒకేలాంటి కథలు అంటే… మ్యానరిజం..అదే పగ, ప్రతీకారం మార్క్ కథలు అంటే విసుగెత్తిపోయారు. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులు రవితేజ ఎలాంటి సినిమా చేసినా… పాత చింతకాయపచ్చడిలా కనబడుతుంది. తలా తోక లేని సినిమాలను ఒప్పుకుంటున్న రవితేజతో సినిమా చెయ్యాలంటేనే నిర్మాతలు పారిపోయే పరిస్థితి వచ్చింది.

అందుకేనేమో ఈ మధ్యన రవితేజ…కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవటమే కాక… రెమ్యునేషన్ ను కూడా తగ్గించుకుని నిర్మాతలకు కొంత భారం తగ్గించాలని ఫిక్స్ అయ్యాడని ఫిలింసర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అంతకు ముందు పది కోట్ల వరకూ రెమ్యునేషన్ డిమాండ్ చేసి తీసుకునే రవితేజ ఇప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించేసాడని ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అందుకే రవితేజ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న నిర్మాత రిలీఫ్ ఫీలయ్యారని… రవితేజ పారితోషకం విషయంలో పట్టువిడుపులుండాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు..

తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశ పరుస్తూ ఉండడంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకొదలుచుకోలేదట. రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్లాప్స్ తో రవితేజ కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నాడని…. అందుకే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు వీఐ ఆనంద్ కు రవితేజ సూచించాడని చెబుతున్నారు. దీంతో రవితేజ సూచించిన మార్పుచేర్పులను చేసే పనిలో వీఐ ఆనంద్ బిజీగా ఉన్నాడట. ఆ పని పూర్తికాగానే సినిమా సెట్స్ మీదకి వెళుతుందట. మరి రవితేజ తీసుకుంటున్న జాగ్రత్తలు విఐ ఆనంద్ సినిమా విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూద్దాం.

Tags:    

Similar News