రవితేజ తగ్గాడండోయ్-Feb 4

కెరీర్ బాగుండాలంటే ఒకే తరహా సినిమాలు చేయకూడదు. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అంత ఇదే ఫాలో [more]

Update: 2019-02-04 03:32 GMT

కెరీర్ బాగుండాలంటే ఒకే తరహా సినిమాలు చేయకూడదు. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అంత ఇదే ఫాలో అయితే కెరీర్ పరంగా సక్సెస్ అవుతారు. కాదు కూడదు అంటే ఇంకా అంతే సంగతులు. రవి తేజ ప్ర‌యోగాలు కు చాలా దూరంగా ఉంటాడు. ఏంటి మీరు ఎప్పుడూ ఒకే త‌ర‌హా మాస్ సినిమాలు చేస్తుంటారు అని అడిగితే ఇంత‌కుముందు ఆటోగ్రాఫ్.. శంభో శివ శంభో లాంటి ప్ర‌యోగాలు చేశాను. దెబ్బ తిన్నాను. అందుకే కొత్త‌ద‌నం వైపు చూడ‌ట్లేదు అని చెప్పేవాడు.

అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడా ముందుకు రాలేదు రవి. అప్పుడెప్పుడో కొత్తగా ట్రై చేశాను అవి వర్క్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఇక కొత్త‌ద‌నం వైపే చూడ‌నంటే ఎలా? ట్రై చేస్తేనే ముందుకు వెళ్ళేది. ఇక గత ఏడాది మూడు సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో మనోడు కొంచం వెనక్కి తగ్గాడు. ర‌వితేజ మార్కెట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అప్పుడువరకు ప‌ది కోట్ల‌కు అటు ఇటుగా పారితోష‌కం తీసుకుంటున్న‌వాడు కానీ ఇప్పుడు దాదాపు న‌ల‌భై శాతం పారితోష‌కం త‌గ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇంతకముందు రవితేజ పారితోష‌కం విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌గా ఉండేవాడు. ఎక్కువ పారితోష‌కం ఇస్తాం అంటే సినిమా ఓకే చేసేసేవాడు. కొన్ని సార్లు ఈ ప‌ట్టుద‌ల‌తో సినిమాలు వ‌దులుకున్న సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తను విఐ ఆనంద్ డైరెక్షన్ లో డిస్కో రాజా అనే సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం రవితేజ తన పారితోష‌కం బాగా తగ్గించుకున్నట్టు టాక్. మరి ఈసినిమా రవితేజ ను ఎంతవరకు తీసుకుని వెళ్తుందో చూద్దాం

Tags:    

Similar News