రవితేజ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

ఆర్ఎక్స్ 100 తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఆ సినిమా తరువాత ఇంతవరకు నెక్స్ట్ సినిమా ఏంటో బయటకు చెప్పలేదు. అంత సక్సెస్ [more]

Update: 2019-07-15 11:02 GMT

ఆర్ఎక్స్ 100 తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఆ సినిమా తరువాత ఇంతవరకు నెక్స్ట్ సినిమా ఏంటో బయటకు చెప్పలేదు. అంత సక్సెస్ వచ్చిన కానీ అజయ్ తన నెక్స్ట్ మూవీ విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ గత కొంత కాలం నుండి అతను చేయబోయే సినిమా టైటిల్ మాత్రం వైరల్ అవుతుంది. మహాసముద్రం అనే టైటిల్ తో అజయ్ నెక్స్ట్ రానున్నాడు.

గతంలో నాగ చైతన్య కి ఈ సబ్జెక్ట్ చెప్పాడు అజయ్. కానీ చైతు కి అది నచ్చకపోవడంతో వెంటనే ఆ కథను రవితేజ కు వినిపించాడు. ఆయన అంగీకరించడంతో వర్క్ కూడా స్టార్ట్ చేసాడు. మొదటి నుండి మనసుకు నచ్చే సినిమాలే చేస్తా అంటున్న బాలీవడ్ బ్యూటీ అదితి రావు ఈ కథ విని లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా అజయ్ కు హీరో అండ్ హీరోయిన్ దొరికేశారు.

కానీ ఈమూవీని నిర్మించేందుకు నిర్మాత ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇది కొంచం భారీ బడ్జెట్ తో చేయాల్సిన సినిమా కాబట్టి. మరి రవితేజ మార్కెట్ ఏమో చాలా డల్ గా ఉంది. ఇటువంటి టైములో రవితేజ సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందు వస్తాడు చెప్పండి? దాదాపు గా ఈమూవీ కి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా చిత్రం తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మహాసముద్రం ఉండే అవకాశముంది

Tags:    

Similar News