రవితేజ తప్పు లేదా?

రవి తేజ తన సినిమాల ప్రమోషన్స్ కి తప్ప వేరే బయట ఏ ఈవెంట్స్ కి కనిపించడు. తన పని తానూ చేసుకుంటూ వెళ్లిపోవడం రవి తేజకి [more]

Update: 2019-09-24 06:10 GMT

రవి తేజ తన సినిమాల ప్రమోషన్స్ కి తప్ప వేరే బయట ఏ ఈవెంట్స్ కి కనిపించడు. తన పని తానూ చేసుకుంటూ వెళ్లిపోవడం రవి తేజకి ముందు నుంచి అలవాటు. తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా..ఎవరూ ఎన్ని కామెంట్స్ చేసినా రవితేజ మాత్రం ఎప్పుడూ రియాక్ట్ కాడు. మొదట నుంచి రవితేజ ఇలానే ఉన్నాడు. అయితే లేటెస్ట్ గా అజయ్ భూపతి చేసిన ‘చీప్‌ స్టార్‌’ కామెంట్‌ గురించి మీడియాలో చిలవలు పలవలుగా రాసినా కానీ రవితేజ ఎప్పటిలానే రియాక్ట్‌ అవలేదు.

కథ నచ్చకే…..

వీరిద్దరి కాంబినేషన్ లో మహాసముద్రం అనే చిత్రం తెరకెక్కుతోందని ఆ మధ్య వార్తలు. ఆ తరువాత ఆ మూవీ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. రవితేజ ఈ సినిమా కి ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో అంత ప్రొడ్యూసర్స్ ఇవ్వలేం అని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఉండొచ్చు కానీ ఇంకో కారణం కూడా ఉండదని తెలుస్తుంది.అజయ్ చెప్పిన స్టోరీ లో సెకండ్ హాఫ్ రవితేజ కు నచ్చలేదట. సెకండ్ హాఫ్ మార్పులు చేసి తీసుకుని రమ్మని రవి కోరినా అజయ్ మాత్రం ఆ మార్పులు చేయడానికి అంగీకరించలేదట. అదే స్టోరీ తో ఇది ఇలా ఉంటెనే బాగుంటుందని రవితేజ ని అజయ్ కన్విన్స్‌ చేయాలని చూసాడట. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పేశాడు. ఒక సీనియర్ హీరోని ఒక అప్ కమింగ్ డైరెక్టర్ అటువంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అసలు దీనిపై రవి స్పందిస్తాడో లేడో చూడాలి.

 

 

Tags:    

Similar News