రవితేజ ధీమా ఏమిటో?

సంక్రాంతి బడా సినిమాల ముచ్చట్లు ముగియకముందే డిస్కో రాజా తో బాక్సాఫీసు వద్దకు వస్తున్న రవితేజ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. ఎందుకంటే ఈ సినిమాపై రవితేజ ఆశలు [more]

Update: 2020-01-24 05:49 GMT

సంక్రాంతి బడా సినిమాల ముచ్చట్లు ముగియకముందే డిస్కో రాజా తో బాక్సాఫీసు వద్దకు వస్తున్న రవితేజ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. ఎందుకంటే ఈ సినిమాపై రవితేజ ఆశలు పెట్టుకోవడమే కాదు.. సినిమా హిట్ అంటున్నాడు. కానీ మరోపక్క డిస్కో రాజాకి థియేటర్స్ కొరత వలన ఈరోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం కష్టంగా కనబడుతుంది. డిస్కో రాజాకి బడా సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ ఝలక్ ఇచ్చినట్లే కనబడుతుంది. సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో థియేటర్స్ యాజమాన్యాలు రెండో వారం కూడా సినిమాలని కంటిన్యూ చెయ్యడంతో డిస్కో రాజా కి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు.

సరిలేరు థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేకపోయినా… దాన్ని తియ్యడానికి థియేటర్ యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. మరోపక్క ఇప్పటికి కళకళలాడుతున్న అల వైకుంఠపురములో పరిస్థితి అంతే. వాటి నుంచి థియేట‌ర్లు రాబ‌ట్టుకోవ‌డం డిస్కోరాజా కు క‌ష్టంగా మారింది. అయినా రవితేజ తన సినిమాని యాజిటీజ్ గా విడుదలకు సిద్ధం చేసాడు. మంచి ప్రమోషస్న్ తో డిస్కో రాజా నేడు విడుదలైంది. తన సినిమాకి హిట్ టాక్ పడితే ఆటోమాటిక్ గా థియేటర్స్ అవే పెరుగుతాయనే ధీమాలో రవితేజ ఉన్నట్లుగా టాక్. మరికొద్దిగంటల్లోనే డిస్కో రాజా బయటికొచ్చేస్తుంది వైట్ అండ్ సి.

Tags:    

Similar News