రణవీర్ సల్మాన్ యూట్యూబ్ ఫైట్

Update: 2018-05-19 04:34 GMT

బాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో రణవీర్ సింగ్ క్రేజ్ వేరు అని ఒప్పుకోవాల్సిందే. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. క్రేజ్ సంపాదించడమే కాదు పలు రికార్డులను తన సొంతం చేసుకున్నాడు.ఇందులో యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ రికార్డ్ కూడా కొంత కాలంగా రణవీర్ దే.

గతంలో రణవీర్ - వాణి కపూర్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ మూవీ 'బేఫికర్' లోని 'నషే సే ఛడ్ గయీ' పాటకు 423 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇంత పెద్ద రికార్డు బ్రేక్ చేయాలంటే కష్టమే అని చెప్పాలి. కానీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ రికార్డు ను బ్రేక్ చేసాడు. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ - కత్రినా జంటగా నటించిన 'టైగర్ జిందా హై' మూవీలోని 'స్వాగ్ సే స్వాగత్' సాంగ్.. 425 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఘనతను సొంతం చేసుకుంది.

అంటే రణవీర్ సింగ్ సినిమా సాంగ్ రికార్డు ని బ్రేక్ చేయడమే కాకుండా హైయెస్ట్ వ్యూస్ కలిగిన బాలీవుడ్ సాంగ్ గా స్వాగ్ సే స్వాగత్ నిలిచింది. ఈ పాట ఇంతలా హిట్ అవ్వడానికి కారణం సల్మాన్ ఖాన్ - కత్రినా మధ్య కుదిరిన కెమిస్ట్రీ. లిరిక్స్ తగ్గట్టు స్టెప్స్ వేయడం..సాంగ్ పాడడానికి ఈజీగా ఉండడం..అలాగే పాట కోసం కత్రినా చిందించిన అందాలు కూడా ఒక రేంజులో ఉన్నాయిలే. మరి పాట పై ఉన్న రికార్డు ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాం.

Similar News