అల్లు అర్జున్ కోసం భారీ కసరత్తులు చేస్తుంది!!

స్టార్ హీరో అల్లు అర్జున్ పక్కన అవకాశం అంటే.. హీరోయిన్స్ కి పండగే. అల్లు అర్జున్ తో సమానమైన డాన్స్ స్టెప్స్ వెయ్యాలి.. అల్లు అర్జున్ పక్కన [more]

Update: 2020-11-02 08:08 GMT

స్టార్ హీరో అల్లు అర్జున్ పక్కన అవకాశం అంటే.. హీరోయిన్స్ కి పండగే. అల్లు అర్జున్ తో సమానమైన డాన్స్ స్టెప్స్ వెయ్యాలి.. అల్లు అర్జున్ పక్కన స్లిమ్ గా నాజూగ్గా కనిపించాలి.. ఇలా ఆలోచిస్తారు హీరోయిన్స్. అలానే ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఛాన్స్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక కూడా ఆలోచిస్తుంది. అందుకే జిమ్ లో తెగ బరువులు ఎత్తేస్తుంది. చూడటానికి పిచ్చుకల కనబడే రష్మిక ఇప్పుడు తెగ బరువులు ఎత్తుతుంది అంటే.. వర్కౌట్స్ మీద ఎంత ఇంట్రెస్త్రో కదా..

కాదు కాదు…. బాడీ ఫిట్ గా ఉండాలి.. నాజూగ్గా ఉండాలి, అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్స్ వెయ్యాలి. అసలే అల్లు అర్జున్ పక్కన అవకాశం ఇది రష్మిక ఎగ్జైట్మెంట్. అందుకే పాప జిమ్ లో బాగా కష్టపడుతుంది. మొన్నామధ్యన బీచ్ ఎక్సర్సైజేస్ చేసిన రష్మిక ఇప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చమట్లు చిందిస్తుంది. తన ట్రైనర్ ఆధ్వర్యంలో రష్మిక జిమ్ లో ఫిగర్ ని పర్ఫెక్ట్ గా ఉండేలా కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి అల్లు అర్జున్ తో పాటుగా రష్మిక ఈ నెల ఫస్ట్ వీక్ లోనే పుష్ప షూటింగ్ సెట్స్ లోకి వెళ్లబోతుంది. ఇక శర్వానంద్ తోనూ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తుంది.

Tags:    

Similar News