అందరూ బోర్ అంటుంటే.. ఈవిడ థాంక్స్ చెబుతుంది!!

కరోనా లాక్ డౌన్ కి అందరూ దణ్ణాలు పెడుతున్నారు. కారణం కొంతమందికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే.. మరికొంతమందికి పని లేక పూట గడవడం లేదు. చాలామంది [more]

Update: 2020-07-22 05:57 GMT

కరోనా లాక్ డౌన్ కి అందరూ దణ్ణాలు పెడుతున్నారు. కారణం కొంతమందికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే.. మరికొంతమందికి పని లేక పూట గడవడం లేదు. చాలామంది హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్ళిపోదామా? అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కరోనా తగ్గనివ్వండి వెళదాం అంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం కరోనా లాక్ డౌన్ కి థాంక్స్ చెబుతుంది కారణం.. లాక్ డౌన్ కారణంగా తన సొంత ఊరిలో తల్లితండ్రులతో కలిసి ఉన్నందుకు. ఆమె పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న. రష్మిక కరోనా లాక్ డౌన్ కి థాంక్స్ చెబుతుంది. చిన్నప్పటినుండి బోర్డింగ్ స్కూల్ లో చదవడంతో హాస్టల్ లో ఉండేదట రష్మిక.

తర్వాత కెరీర్ అంటూ సినిమాల్లో బిజీ అయ్యాక తల్లితండ్రులతో కలిసి ఉండాలని ఉన్నా కుదిరేది కాదట. లాక్ డౌన్ పెట్టగానే హమ్మయ్య నేను అనుకున్న, కోరుకున్న చిన్న బ్రేక్ దొరికింది అని ఫీల్ అయ్యిందట. కానీ మళ్ళీ లాక్ డౌన్ పొడిగించేసరికి.. తల్లితండ్రుల దగ్గరికి కూర్గ్ వెళ్లిపోయిందట రష్మిక. అక్కడ కూర్గ్ లో తాను చిన్నప్పటి నుండి ఏం మిస్ అయ్యిందో తనకి అర్ధమయిందట. మా ఇంటి కిటికీ దగ్గర నుండి బయటికి చూస్తుంటే.. మంచుతో నిండిన కొండలు.. చుట్టూ సువాసన వెదజల్లే కాఫీ తోటలు.. వావ్.. అద్భుతంగా ఉందిక్కడ అంటుంది రష్మిక. ఈ లాక్ డౌన్ లో ఆన్ లైన్ లోనే కథలు వింటుందట రష్మిక. అంతేనా తన స్టాఫ్ కి తన తండ్రి కంపెనీలో పనిచేసి స్టాఫ్ కి పనిలేకపోయినా జీతాలిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నా అని చెబుతుంది రష్మిక. ఎంతైనా రశ్మికది చాలా పెద్ద మనసు. 

Tags:    

Similar News