రెండు హిట్స్ కే పొగరు తలకెక్కిందా?

సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రష్మికకి కాస్త ఎక్కువైనట్లుగా కనబడుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరో మహేష్ ని ఆటపట్టిస్తూ [more]

Update: 2020-03-04 10:44 GMT

సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన రష్మికకి కాస్త ఎక్కువైనట్లుగా కనబడుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరో మహేష్ ని ఆటపట్టిస్తూ రష్మిక చేసిన అల్ల్లరి చాలా అతిగా అనిపించింది. అందులో నా తప్పు లేదు దర్శకుడు ఏం చెబితే అదే చేశా అంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక కేరెక్టర్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ తనకి తెలియవని.. అయినా ఫ్యూచర్ లో అలంటి పాత్రలు ఒప్పుకోనంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇక భీష్మ సినిమాలో నితిన్ కి జోడిగా రష్మిక పెరఫార్మెన్సు ఆకట్టుకుంది. చూడముచ్చటగా కాస్త గ్లామర్ గా హీరోగారికి క్లాస్ పీకే పాత్రతో భీష్మ లో రష్మిక అదరగొట్టింది.

అయితే రెండు వరస హిట్స్ తో ఉన్న రష్మిక కి కాస్త పొగరెక్కువైందో.. లేదంటే ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిందో కానీ.. ఎయిర్పోర్ట్ లో రష్మిక ఓవరేక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్మిక అల్లు అర్జున్ సినిమా కోసం మల్లీ హైద్రాబాదులో కాలుపెట్టింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రష్మిక చేసిన ఓవరేక్షన్ కి ఇప్పుడు అభిమానులే కాదు. నెటిజెన్స్ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఫోటో గ్రాఫేర్స్ కి ఫోజిలివ్వడమేకాదు.. రష్మిక నడుస్తూ డాన్స్ చేస్తూ చేసిన ఓవరేక్షన్ ని ఓ నెటిజెన్ తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో వదిలాడు. ఇక చూడండి ఆ వీడియో చూసిన వారంతా రెండు హిట్స్ పడేసరికి పాపకి పొగరెక్కువైంది. లేదంటే ఎయిర్పోర్ట్ లో ఇలా డాన్స్ చేస్తూ ఓవరేక్షన్ చెయ్యడమేమిటి అంటూ రష్మికాని ఆడేసుకుంటున్నారు.

Tags:    

Similar News