హమ్మయ్య.. అఖిల్ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయింది

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా ఓ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబందించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ [more]

Update: 2019-07-01 07:18 GMT

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా ఓ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి సంబందించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయ్యి వారం రోజులు కూడా కావొస్తుంది కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ చేయలేదు. ఆ మధ్య ఇద్దరు ముగ్గురు కొత్త హీరోయిన్స్ అనుకున్నారు కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ జోడిగా ఓ హీరోయిన్ ఫైనల్ అయిపోయిందట.

అఖిల్ సరసన దాదాపుగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నే హీరోయిన్ గా ఫైనల్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులు తరువాత ఈ సస్పెన్స్ కి తేరా దించారు మేకర్స్. చాలామంది పేర్లు పరిశీలించినా చివరికీ రష్మికా మందన్న వైపే మొగ్గు చూపారట.తొలిసారిగా అఖిల్ – రష్మిక కాంబినేషన్ తెరపై కనిపించనుంది. అఖిల్ కి ఇప్పటివరకు చెప్పుకోవటానికి ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఈసినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Tags:    

Similar News